ఆర్మీ 'మేజర్ 'గా అడవిశేషు..నిర్మాతగా మెష్ బాబు
- February 28, 2019
టాలీవుడ్ లో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తున్న అడవిశేషు..ఇటీవల గూఢచారి సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేశాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఈ తరహా సినిమా రావడంతో ఆడియన్స్ కొత్తగా ఫీల్ కావడం..సినిమా మంచి హిట్ అయ్యేందుకు దోహదపడింది. శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అడివి శేష్ కెరీర్ లోనే ఉత్తమ సినిమాగా నిలిచింది. ఈ సారి 'మేజర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు అడవి శేషు.
26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ ఇన్‌స్పిరేషన్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కూడా శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించనున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నాయి. అడివి ఎంటర్ టైన్ మెంట్, శరత్ చంద్ర, ఎ+జి మూవీస్ ఈ సినిమా నిర్మాణంలో సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
ఈ సినిమా రెండు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారట. 2020లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా సోనీ పిక్చర్స్ సంస్థ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అలాగే జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ అడవిశేషు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. పోస్టర్ చూస్తుంటే మరో హిట్ కొట్టేలా ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







