ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ సర్వీసెస్‌ ఇకపై ఆన్‌లైన్‌లోనే

- February 28, 2019 , by Maagulf
ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ సర్వీసెస్‌ ఇకపై ఆన్‌లైన్‌లోనే

మస్కట్‌: ఒమన్‌లో భారత పౌరులు తమ పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌ చేసుకోవాలంటే ఇకపై ఆన్‌లైన్‌ని మాత్రమే ఆశ్రయించాల్సి వుంటుంది. ఇండియన్‌ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 3 నుంచి గ్లోబల్‌ పాస్‌పోర్ట్‌ సేవా ప్రోగ్రామ్‌ అందుబాటులోకి వస్తుంది. తద్వారా పాస్‌పోర్టుల కోసం ఎంబసీ పాస్‌పోర్ట్స్‌ ఇండియా వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం వున్న మాన్యువల్‌ విధానం మార్చి 10తో రద్దవుతుంది. మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్సటర్నల్‌ ఎఫైర్స్‌ ఈ మేరకు ప్రపంచంలోని పలు దేశాల్లో వున్న ఎంబసీలు, కాన్సులేట్లకు సమాచారం అందించింది. భారత ప్రభుత్వ డిజిటలైజేషన్‌ విధానంలో ఇది కూడా ఓ భాగం. కొత్త విధానంతో పాస్‌పోర్ట్‌ సర్వీసులు మరింత సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com