పాక్‌ - భారత్‌ మధ్య మధ్యవర్తిత్వం లేదు

- March 02, 2019 , by Maagulf
పాక్‌ - భారత్‌ మధ్య మధ్యవర్తిత్వం లేదు

అబుధాబి:పాకిస్తాన్‌, భారత్‌ మధ్య ప్రస్తుత పరిస్థితుల్లో ఓఐసీ నుంచి ఎలాంటి మధ్యవర్తిత్వం లేదని భారత విదేశాంగ శాఖ అధికారులు స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేననీ, ఈ విషయంలో ఇంకో మాటకు తావులేదని విదేశాంగ శాఖ కార్యదర్శుల్లో ఒకరైన టి.యస్ తిరుమూర్తి చెప్పారు. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో-ఆపరేషన్‌ సమ్మిట్‌ సందర్భంగా అబుధాబిలో జరిగిన సమావేశంలో భారత విదేశాంగ శాఖ అధికారులు ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. కాగా, ఎంఇఎ అధికార ప్రతినిథి ఇండియా - పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణంపై మాట్లాడేందుకు నిరాకరించారు. టి.యస్ తిరుమూర్తి మాట్లాడుతూ, ఈ శుక్రవారం చారిత్రాత్మకమైన రోజు అనీ, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌గా ఓఐసి సమావేశంలో ప్రసంగించడం గొప్ప విషయమని అన్నారు.ఈ ప్రెస్ మీట్ లో ఇండియన్ అంబాసిడర్ నవదీప్ సింగ్ సూరి,అఫీషియల్ స్పోక్స్ పర్సన్  రవనీష్ కుమార్ పాల్గొన్నారు 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com