సౌదీ అరేబియా 9వ పవర్‌ఫుల్‌ కంట్రీ

- March 04, 2019 , by Maagulf
సౌదీ అరేబియా 9వ పవర్‌ఫుల్‌ కంట్రీ


జెడ్డా:పొలిటికల్‌ మరియు ఫైనాన్షియల్‌ ఇన్‌ఫ్లూయెన్స్‌ విభాగాల్లో సౌదీ అరేబియా 9వ ర్యాంక్‌ని దక్కించుకుంది. అమెరికాకి చెందిన ఓ స్టడీ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ దేశాల జాబితాలో 9వ ర్యాంక్‌ సౌదీ అరేబియాకి దక్కడం పట్ల అంతటా హర్షం వ్యక్తమవుతోంది. సౌదీ అరేబియాని మిడిల్‌ ఈస్ట్‌ జెయింట్‌గా ఈ స్టడీ అభివర్ణించింది. అత్యధికంగా ఆయిల్‌ రిజర్వులను కలిగి వుండడమే కాక, ప్రపంచ దేశాలకు భారీయెత్తున చమురు ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడం, అలాగే మిలియన్ల మంది ముస్లింలు మక్కాను సంవత్సరం పొడుగునా పర్యటించడం తెలిసిన సంగతులే. కాగా, బిజినెస్‌ ఇన్‌సైడర్‌ మ్యాగజైన్‌లో ఈ స్టడీ వివరాలు ప్రచురితమయ్యాయి. అమెరికా తొలి స్థానంలో నిలిచింది. రష్యా, చైనా, జర్మనీ మరియు బ్రిటన్‌ తర్వాతి స్థానాల్లో వున్నాయి. టాప్‌టెన్‌లో ఫ్రాన్స్‌, జపాన్‌, సౌత్‌ కొరియా వుండగా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కి 11వ స్థానం దక్కింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com