దిల్ రాజు బ్యానర్లో మళ్లీ రాజ్ తరుణ్
- March 05, 2019
వరుస అవకాశాలతో .. వరుస విజయాలతో దూసుకొచ్చిన యువ కథానాయకులలో రాజ్ తరుణ్ ఒకరు. అయితే క్రితం ఏడాది ఆయనను వరుస పరాజయాలు పలకరించాయి. దాంతో సహజంగానే అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆయన దిల్ రాజు ప్రాజెక్టులో ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. ఇంతకుముందు దిల్ రాజు బ్యానర్లో 'లవర్' తో పరాజయాన్ని చవిచూసిన రాజ్ తరుణ్, మళ్లీ అదే బ్యానర్లో అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. 'ఆడు మగాడ్రా బుజ్జి' ఫేమ్ కృష్ణారెడ్డి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకి 'నీది నాది ఒకటే లోకం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ నెల 3వ వారంలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో రాజ్ తరుణ్ వున్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..