ఇంటర్ అర్హతతో ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. ప్రారంభవేతనం రూ.25,500
- March 05, 2019
ఎంప్లాయ్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ లిమిటెడ్ డైరక్ట రిక్రూట్మెంట్ ద్వారా తమిళనాడు రీజియన్లో స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. తగిన అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య
స్టెనోగ్రాఫర్: 20
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంగ్లీష్/ హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 80 పదాలు టైప్ చేయగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
అప్పర్ డివిజన్ క్లర్క్( యూడీసీ): 131
అర్హత: డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి: 15.04.2019 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధన ప్రకారం వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్/ఈ చలానా ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఎంపిక విధానం: స్టెనోగ్రఫీ పోస్టులకు రాతపరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్ నిర్వహిస్తారు. యూడీసీ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.03.2019
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.04.2019
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..