భారత సబ్‌మెరైన్‌ని అడ్డుకున్న పాకిస్తాన్
- March 05, 2019
తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిందంటూ భారత నావికా దళానికి చెందిన జలాంతర్గామి (సబ్‌మెరైన్)ని పాకిస్తాన్ అడ్డుకుంది. ఇటీవల భారత్ - పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 'మా ప్రాదేశిక జలాల్లోకి భారత జలాంతర్గామి వచ్చేందుకు ప్రయత్నించింది. దాన్ని మేం అడ్డుకున్నాం. గతంలో కూడా ఓ సారి ఇలాంటి ఘటన చోటు చేసుకుంది' అని పాకిస్తాన్ నేవీకి చెందిన అధికార ప్రతినిథి వెల్లడించారు. భారత్‌తో ఎలాంటి వైరం పెట్టుకునే ఉద్దేశ్యం తమకు లేదనీ, శాంతియుత ఆలోచనలతోనే తాము ఆ జలాంతర్గామిని టార్గెట్ చేయలేదని తెలిపారాయన. గతంలో, అంటే 2016లో ఇలాంటి ఘటన జరిగింది. ఇదిలా వుంటే, భారత నావికా దళం, పాకిస్తాన్ ఆరోపణల్ని తిప్పికొట్టింది. అలాంటి ఘటన ఏదీ జరగలేదని పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..