కువైట్ జనాభా 4.7 మిలియన్లు
- March 06, 2019
కువైట్ సిటీ: ఫిబ్రవరి చివరినాటికి కువైట్ జనాభా 4.7 మిలియన్లుగా నమోదయ్యింది. ఇందులో 1.4 మిలియన్ మంది కువైటీలు కాగా, 3.3 మిలియన్ల మంది వలసదారులు. కువైటీల సంఖ్య 2009తో పోల్చితే 1.1 మిలియన్ల నుంచి 1.4 మిలియన్ల వరకు చేరుకోవడం గమనార్హం. ఈ పెరుగుదల 27 శాతం కాగా, వలసదారుల పెరుగుదల శాతం 41గా నమోదయ్యింది. కువైటీ పౌరులతో పోల్చితే వలసదారుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. కువైటీల పెరుగుదలతో అదనంగా డొమెస్టిక్ లేబర్ అవసరమవుతోంది. 2010లో వారి సంఖ్య 570,000గా వుంటే, వారి సంఖ్య 677,000గా 2017లో నమోదయ్యింది. సగటున ఏడాదికి 15,000 మంది డొమెస్టిక్ వర్కర్స్ అదనంగా నమోదవుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







