జయలలితను 'హల్వా'తో చంపేశారు, సరైన విధంగా శశికళను ప్రశ్నిస్తే తెలుస్తుంది: సీవీ షణ్ముగం

- March 07, 2019 , by Maagulf
జయలలితను 'హల్వా'తో చంపేశారు, సరైన విధంగా శశికళను ప్రశ్నిస్తే తెలుస్తుంది: సీవీ షణ్ముగం

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను హల్వా ఇచ్చి చంపేశారంటూ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం సంచలన ఆరోపణ చేశారు. అన్నాడీఎంకే తరఫున పోలింగ్‌ బూత్‌ ఏజెంట్ల సమావేశంలో ప్రత్యేక అతిథిగా ఆయన పాల్గొన్న ఆయన ఈ ఆరోపణ చేశారు. దీంతో జయలలిత అభిమానులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. దీంతో జయలలిత మృతిపై ఆయన మరో కొత్త ఆరోపణను తెరపైకి తెచ్చారు. జయలలితను అపోలో ఆస్పత్రిలో చేర్చినప్పుడు ఆమెను చూసేందుకు వెళ్తే సాధ్యపడలేదని మంత్రి తెలిపారు. అంతేకాక శశికళే తమను ఆసుపత్రిలోకి అనుమతించలేదని ఆయన ఆరోపించారు. జయలలిత మధుమేహంతో బాధ పడుతున్న విషయం తెలిసి కూడా ఆమెకు హల్వా ఇచ్చారు. ఈ విధంగా ఆమె వ్యాధి ముదిరి సహజంగా మరణించాలనే ఇలా ప్లాన్ చేశారంటూ ఆయన ఆరోపించారు. కార్డియాక్‌ అరెస్ట్‌ వస్తే ఆస్పత్రి వరండాలో రక్తం ఎలా చిందిందని? ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. జయలలిత కోలుకుంటుందని తెలిపినప్పుడు వెంటనే ఎలా కార్డియాక్‌ అరెస్ట్‌ రాగలదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే సరైన విధంగా శశికళను ప్రశ్నిస్తే వాటంతట అవి అసలు నిజాలు బయటకు వస్తాయని మంత్రి సీవీ షణ్ముగం తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com