ఎస్పైర్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ప్రారంభం
- March 07, 2019
దోహా: మూడవ ఎడిషన్ ఎస్పైర్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. ఎస్పైర్ పార్క్ వద్ద ఏర్పాటయిన ఈ కార్యక్రమంలో 18 దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్‌కి అధికారిక స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్నట్లు ఓరెడూ ప్రకటించింది. వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా తిలకించేందుకు, కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. వచ్చినవారిలో మహిళలు, పిల్లలు కూడా ఎక్కువగా వున్నారు. 40,000 మంది విజిటర్స్, 500 మంది స్టూడెంట్స్ ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటారని అంచనా. మొత్తం నాలుగు రోజులపాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. వివిధ రంగుల్లో, రకరకాల రూపాల్లో కైట్స్ (పతంగులు - గాలి పటాలు) ఆకాశంలో కనువిందు చేస్తోంటే పిల్లలూ పెద్దలూ వాటిని చూసి కేరింతలు కొడుతున్నారు. పుడ్ ట్రక్స్, పేరేడ్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్, స్టూడెంట్ యాక్టివిటీస్, వర్క్ షాప్స్ వంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..