వెనక్కు పంపడంలో అంతరార్ధం ఏమిటి..?

- December 29, 2015 , by Maagulf

ఒకప్పుడు చదువుకోవడానికి వీసాలను ఇవ్వడం కష్టతరం చేసిన అమెరికా ఇప్పుడు వారి ఆర్ధిక వనరులను పెంచుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా అది మన భారత దేశంలో ఉన్నంత అమెరికా పై మోజును ఎలా సొమ్ము చేసుకుంటోందో.. ఇక్కడ వీసాలు ఇచ్చేటప్పుడు వారికి తెలియదా అవి మంచి యునివర్సిటిలు అవునో కాదో ... వీసా ఇచ్చినట్టు ఇచ్చి అన్ని రకాలుగా డబ్బులు చేసుకుని వెనక్కు పంపడంలో అంతరార్ధం ఏమిటి..? తానా స్వేర్ లు పెద్దలు చాలా మంది చాలా సలహాలు సూచనలు ఇస్తున్నారు ... అవి అన్ని వీళ్ళ కన్నీళ్ళు తుడవవు అని వారికి తెలుసు .. ఇంతకూ ముందు కూడా ఒకప్పుడు F1 వీసాలు ఇవ్వకుండా నిబంధనలు కష్టతరం చేసారు అది ఒకరకం .. అక్కడకు వెళ్ళిన తరువాత వెనక్కు పంపడంలోఅమెరికా అంతరార్ధం ఏమిటి.. మన తెలుగు వాళ్లకు ఎంత చెప్పినా దూరపు కొండలు నునుపు ... నేను అక్కడ చూసిన చాలా చదువుల తరువాత వారు ఇప్పటికి కనీసం మంచి ఉద్యోగాలు చేయక వేరేగా స్థిరపడిపోయారు... నేను H 1 వీసా తో వెళ్ళాను .. నేను చాలా ఇబ్బందులు పడ్డాను మంచి కంపెని అని నమ్మి .. ఇక్కడ ఆ నిజాలు చెప్పేసాను అనుకోండి నామీద యుద్ధం ప్రకటిస్తారు అందరు...
ఇంకో నాలుగు నెలలు పొతే H 1 లాటరీ మోజు మొదలౌతుంది .. అది కూడా ఇదే స్థితి ... డాక్యుమెంట్స్ లేకుండా వీసాలు ఎలా ఇచ్చేస్తారు ... ట్రావెల్స్, అమెరికా కలిసి చేస్తున్న వ్యాపారం ఇది .. మనకు అమెరికా మోజు తీరనంత కాలం వీళ్ళు మనతో ఇలానే ఆడుకుంటారు ... ప్రభుత్వం లేఖలు, తానా కబుర్లు ఇవి అన్ని ఎందుకు ఉపయోగపడవు ... అమెరికాకు ఈ ఆటలు అలవాటే ఏదో ఒక వీసాతో ఇలా ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు ... నిజం చెప్పొద్దు మనకు గొప్పలు చెప్పుకునే అలవాటు అందరికన్నా ఎక్కువే కదా అందుకే ఈ తిప్పలు ... ఇంట గెలవడం ఎలాగు రాదు రచ్చ అభాసు పాలౌతున్నాం మనకున్న డాలర్ల పిచ్చిలో పడి ... గాస్ స్టేషన్లో గంటకు పది డాలర్లు సంపాదించి అదే జీవితం అనుకుంటూ ఇక్కడేమో మా అబ్బాయి అమెరికాలో పెద్ద ఉద్యోగం అంటూ చెప్పుకు తిరిగే తల్లిదండ్రులకు ఈ సంఘటనలు కనువిప్పు కావాలని కోరుకుంటూ .... M.S కాదు మీలో సత్తా ఉంటే ఇక్కడ రాంక్ సంపాదించండి ... అమెరికా వలసలు కొన్ని రోజులు ఆపండి ... !!

--మంజు యనమదల 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com