'అర్జున' వస్తున్నాడు
- March 07, 2019డా. రాజశేఖర్ హీరోగా సి.కల్యాణ్ సమర్పణలో సి.కె.ఎంటర్టైన్మెంట్స్, హ్యపీ మూవీస్ పతాకాలపై కన్మణి దర్శకత్వంలో కాంత కావూరి నిర్మిస్తున్న చిత్రం 'అర్జున'. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఎప్పుడో ప్రారంభమైన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. మార్చి 15న సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు. రాజశేఖర్ సరసన మేరియం జకారియా, సాక్షి గులాటి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీత సారథ్యం వహించగా మధు నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
కోట శ్రీనివాసరావు, రేఖ, సనా, మురళీ శర్మ, ఆనంద్, ప్రభాకర్, బెనర్జీ, చలపతి రావు, వేణుమాధవ్, బాబు మోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫైట్స్: కనల్ కణ్ణన్, సినిమాటోగ్రఫీ: మధు ఎ.నాయుడు, ఎడిటర్: గౌతంరాజు, మ్యూజిక్: వందేమాతరం శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి.మహేష్ చౌదరి, నిర్మాత: కాంత కావూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కన్మణి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..