అమెరికా లో ఫేస్ బుక్ కు షాక్

- March 07, 2019 , by Maagulf
అమెరికా లో ఫేస్ బుక్ కు షాక్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అమెరికాలో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. యూఎస్ లో ఊహించనంతగా యూజర్లు ఫేస్ బుక్ కు దూరమవుతున్నారు. 2017 ఉన్న యూజర్లతో పోల్చితే. అమెరికాలో దాదాపు ఒకటిన్నర కోటి మంది యూజర్లు ఫేస్ బుక్ నుంచి వైదొలిగారు. వీరిలో ఎక్కువ మంది 12 నుంచి 34 ఏళ్ల మధ్యలో ఉన్నవారు. ఒకానొక సమయంలో ఈ వయసు వారే ఫేస్ బుక్ కు పెద్ద మార్కెట్ గా ఉండేవారు. ఈ వివరాలను మార్కెట్ రీసర్చ్ సంస్థ 'ఎడిసన్ రీసర్చ్' వెల్లడించింది.ఫేస్ బుక్ కు దూరమవుతున్న వారు క్రమంగా ఇన్స్టాగ్రామ్ కు దగ్గరవుతున్నారు. ఫేస్ బుక్ లో ఫేక్ న్యూస్ ఎక్కువగా షేర్ అవుతుండటం, యాడ్స్ పెద్ద తలనొప్పిగా మారడం యూజర్లకు చికాకును తెప్పిస్తోంది. వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్ బుక్ చోరీ చేస్తోందనే అసంతృప్తి కూడా ఫేస్ బుక్ యూజర్లలో బలంగా ఉంది. డేటా చోరీ అంశంలో ఫేస్ బుక్ ఇప్పటికే విచారణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీటన్నింటి నేపథ్యంలో, ఫేస్ బుక్ కు భారీ ఎత్తున అమెరికన్లు గుడ్ బై చెబుతున్నారు. ఇన్స్టాగ్రామ్ కు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com