సుర్ అల్ హదిద్ బీచ్ కార్నివాల్ ప్రారంభం
- March 08, 2019
మస్కట్: మస్కట్ గవర్నరేట్ పరిధిలోని సీబ్ బీచ్ వద్ద సుర్ అల్ హదిద్ బీచ్ కార్నివాల్ ప్రారంభమయ్యింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కార్నివాల్ వుంటుంది. మస్కట్ మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది. కార్నివాల్‌లో రెస్టారెంట్స్, కేఫ్స్, షాపింగ్ కార్నర్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అలాగే బీచ్ గేమ్స్ ఆహూతుల్ని అలరిస్తాయి. ఒమన్‌లో తొలి బీచ్ ఈవెంట్ అయిన ఈ ఫెస్టివల్‌ని మస్కట్ మునిసిపాలిటీ - మినిస్ట్రీ ఆఫ్ టూరిజం - ఒమన్ టూరిజం డెవలప్‌మెంట్ కంపెనీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. డొమెస్టిక్ టూరిజంని ప్రోత్సహించే క్రమంలో ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. అల్ సీబ్ క్లబ్ నిర్వహించే బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ ఈ ఈవెంట్‌లో మరో ప్రధాన ఆకర్షణ. జెట్ స్కీయింగ్, బనానా బోట్ రైడింగ్, కయాకింగ్ వంటి ఆకర్షణలూ వున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..