కేజీఎఫ్ చాప్టర్-2 షూటింగ్ ప్రారంభం!
- March 09, 2019
తెలుగు ఇండస్ట్రీలోకి కన్నడ హీరో యష్ ఓ ప్రభంజనం సృష్టించాడు. సాధారణంగా మన తెలుగు చిత్రాలు తమిళ, హిందీ భాషల్లో రిమేక అవుతుంటాయి. కొన్ని చిత్రాలు కన్నడ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంటాయి. అయితే కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు లో ఇప్పటి వరకు చాలా మంది నటులు ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు విలన్ గా కన్నడ ప్రభాకర్, నీలగల్ రవి తర్వాత ఉపేంద్ర, ఈగ చిత్రంతో కిచ్చా సుదీప్ లు ఎంట్రీ ఇచ్చారు.
తాజాగా కేజీఎఫ్ చిత్రంతో కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను కన్నడ బాహుబలి అని ముద్దుగా పిలుచుకుంటారు అక్కడి ప్రేక్షకులు.కేజీఎఫ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాకు సీక్వెల్ రాబోతోంది. కేజీఎఫ్ చాప్టర్-2 సెట్స్ పైకి వెళ్లేందుకు రంగం సిద్ధం అవుతోంది. కేజీఎఫ్ సినిమాను విడుదల చేసినప్పుడే దాన్ని చాప్టర్-1గా పరిచయం చేశారు. ఈ చిత్రంలో బంగారు గనిలోకి హీరో ఎలా ఎంట్రీ ఇచ్చాడు..గనికి ఎలా అధిపతి అయ్యాడనే విషయాల్ని చూపించారు.
అయితే ఆ గనిపై కన్నువేసిన శత్రువులను ఎలా ఎదుర్కొంటాడు అన్న విషయం కేజీఎఫ్ చాప్టర్-2 చూపించబోతున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే యష్ హీరోగా వచ్చే నెల మూడో వారం నుంచి కేజీఎఫ్ చాప్టర్-2 సెట్స్ పైకి వస్తుంది. చాప్టప్-2 కోసం బాలీవుడ్ నటీనటుల్ని కూడా తీసుకుంటున్నారు. అంతేకాదు, బడ్జెట్ ను కూడా డబుల్ చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..