డాక్టర్ల మాటలతో ‘సోనాలీ’ షాక్..
- March 09, 2019
ఖరీదైన వైద్యం కంటే కాసిని మంచి మాటలు బ్రతుకుపై ఆశలు కల్పిస్తాయి. డాక్లర్లు చెప్పిన మాటలకి కృంగిపోకుండా కొంత మనోధైర్యాన్ని, మరికొంత భర్త వాత్సల్యం కలిసి ఆమెను త్వరగా కోలుకునేలా చేసింది. తనకి క్యాన్సర్ ఉందని తెలిసిన కొత్తలో పరిస్థితి వివరించింది సోనాలీ బింద్రే ఓ ఇంటర్వ్యూలో.. మెరుగైన చికిత్స కోసం భర్త గోల్డీ న్యూయార్క్ వెళదామన్నారు. కానీ అందుకు నేను తిరస్కరించాను. ఇక్కడే మంచి డాక్టర్లు ఉన్నారు కదా. వేరే దేశం ఎందుకు వెళ్లాలి అని ఆయనతో గొడవపడ్డాను. మూడు రోజుల్లో వచ్చేద్దామని గోల్డీ నన్ను ఒప్పించారు . న్యూయార్క్‌లోకి అడుగుపెట్టిన తరువాత అక్కడి వైద్యులను కలిసిన తరువాత క్యాన్సర్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించారు. వ్యాధి నాలుగో దశలో ఉందని.. బతికే అవకాశాలు 30 శాత్రం మాత్రమే ఉన్నాయన్నారు. ఆ మాటలతో తాను షాక్‌కి గురయ్యానన్నారు. ఆ క్షణంలో నా భర్తని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాను. మంచి ట్రీట్మెంట్ ఇప్పించి, నా కెంతో సపోర్ట్‌గా నిలిచి, ఎంతో ధైర్యాన్నిచ్చిన నా భర్తకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదన్నారు. చికిత్స తీసుకునే సమయంలో సోనాలీ సోషల్ మీడియా ద్వారా తన మనోభావాలను ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తూ కొంత ఊరట చెందారు. ట్రీట్మెంట్ అనంతరం ఇండియాకి తిరిగి వచ్చిన సోనాలి క్యాన్సర్‌పై అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తున్నారు. మారిన జీవనశైలి కారణంగా క్యాన్సర్ మహహ్మారి మనుషులను పట్టి పీడిస్తోంది. మెరుగైన వైద్యం, గుండె నిబ్బరం, కృంగిపోని ఆత్మవిశ్వాసం వ్యాధినుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది. నటి మనీషా కోయిరాలా, క్రికెటర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్‌ని జయించి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..