ఈ యాప్ ద్వారా మీ ఓటు ఉందో ..లేదో తెలుసుకోవచ్చు
- March 09, 2019
ఎన్నికల పమీపిస్తున్న వేళ ఓట్ల గల్లంతు అంశం ఓటర్లను ఉక్కిరిబిక్కరి చేస్తుంది. తాజాగా జరుగుతన్న పరిణామాలు కూడా ఓటర్లను మరిం గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఓట్లు గల్లంతైందా లేక ఉందా అనే తదితర వివరాలు తెలుసుకోవడానికి ఓ అవకాశం ఉంది. ఇందుకు గూగుల్ ఫ్లే స్టోర్ నుంచి ఓటర్ హెల్ఫ్‌లైన్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రోల్ రోల్‌పై క్లిక్ చేయాలి
వాటిలో ఉన్న ఆప్షన్‌ల ప్రకారం ఓటరు పేరు, తండ్రి పేరు, వయస్సు, నియోజకవర్గం, జిల్లా వంటి వివరాలు నమోదు చేయాలి
మీ వివరాలు ఓటరు జాబితిలో ఉంటే వెంటనే స్మార్ట్‌ఫోన్‌లో తెరపై సమగ్ర వివరాలు ప్రత్యక్షమవుతాయి.
ఇలా మీకు ఓటు ఉందా?లేదో తెలుసుకోవచ్చు
అలా కాకుండా ఓటరు కార్డు నంబరు తెలిసి ఉంటే ఆ నంబరును యాప్‌లో నమోదు చేయడం ద్వారా కూడా ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
స్మార్ట్ ఫోన్ లేని వారు టోల్‌ఫ్రీ నంబరు 1950 కు కాల్ చేయడం ద్వారా కూడా ఓటరు వివరాలు తెలుసుకోవచ్చు.
ఓటరు ప్రమెయం లేకుండా ఓటును తొలిగిస్తే యాప్ ద్వారానే అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది
అలాగే కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఫారం-6,తొలగింపునకు ఫారం-7, వివరాల మార్పునకు ఫారం-8.. లాంటి పామ్‌లు కూడా ఈ యాప్ ఉన్నాయి.
ఎన్నికల సంఘం నిర్ణయాలు,ప్రకటనలు కూడా దానిలో ఉంటాయి
అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా యాప్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు.
ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల ఎలా ఉపయోగించాలి అన్న అంశాలపై కూడా ఈ యాప్‌లో అవగాహన వీడియోలు ఉన్నాయి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







