40 కిలోల డ్రగ్స్‌తో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు
- March 09, 2019
అబుదాబీ పోలీసులు 40 కిలోల క్రిస్టల్ మెత్‌ని పార్క్ చేసి వున్న పాత కారులో గుర్తించారు. ముసఫ్ఫా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసినవారిలో ఒకర్ని 'ది స్కార్పియన్'గా గుర్తించారు. డ్రగ్ కంట్రోల్ సెక్షన్ డైరెక్టరేట్ హెడ్ కల్నల్ తాహెర్ ఘరీబ్ అల్ దహ్రి మాట్లాడుతూ, విశ్వసనీయ వర్గాల సమాచారంతో సోదాలు నిర్వహించగా, నిందితులు వారితోపాటు డ్రగ్స్ స్వాధీనం చేసుకోగలిగామని చెప్పారు. క్రిస్టల్ మెత్‌ని పెద్ద మొత్తంలో తీసుకు వచ్చి, దాన్ని చిన్న చిన్న ప్యాక్టెలలో నింపి సరఫరా చేస్తుంటారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







