బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తాం:రాహుల్
- March 09, 2019
తెలంగాణ:తాము అధికారంలో రాగానే ప్రతి పేదలకు కనీస ఆదాయం వచ్చేలా పథకం అమలు చేస్తామన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ నీరవ్ మోదీ లాంటి వారి అకౌంట్లో డబ్బులు వేస్తే…తాము పేదల బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని అన్నారాయన. దేశంలోని ఏ ఒక్క పేదవాడిని వదలకుండా కనీసం ఆదాయం వచ్చేలా పథకం రూపొందిస్తామన్నారు. శంషాబాద్ లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న రాహుల్..తమ పార్టీ పేదల కోసం పోరాడుతుందని అన్నారు.
నోట్ల రద్దు, జీఎస్టీతో దేశ ఆర్ధిక వ్యవస్థ పతనమై పోయిందన్నారు రాహుల్ గాంధీ. తాము అధికారంలోకి రాగానే జీఎస్టీని ఒకే శ్లాబులో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక నిరుద్యోగులు, చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు బ్యాంకు లోన్లు ఇప్పిస్తామన్నారు. రైతులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ మోడీ చేతిలో రిమోట్ లా మారారని ఆరోపించారు రాహుల్ గాంధీ. చైనా సైన్యం డోక్లాం సరిహద్దు దాటితే..మోదీ చైనా అధ్యక్షుడితో ఊయ్యాల ఊగారని గుర్తు చేశారు. పుల్వామా దాడి సమయంలో సినిమా తీయించుకుంటున్నారని విమర్శించారు. మోదీది దొంగదేశభక్తి అంటూ ఫైర్ అయ్యారు రాహుల్. దేశసంపదను 15 మందికి దోచి పెట్టారని ఆరోపించారు.
తాజా వార్తలు
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!







