ఇథియోపియోలో కూలిన విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్సు దొరికింది..
- March 11, 2019ఇథియోపియోలో కూలిన విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్సు దొరికింది. ఫ్లయిట్ రికార్డులు దొరికినట్లు దర్యాప్తు చేసే అధికారులు వెల్లడించారు. విమానం కూలిన ప్రదేశం నుంచి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, డిజిటల్ ఫ్లయిట్ డేటా రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇథియోపియా రాజధాని అడిస్ అబబా నుంచి బయలుదేరిన ఆరు నిమిషాలకే.. బోయింగ్ 737 మాక్స్ 8 విమానం కూలింది. ఆదివారం జరిగిన ఆ ఘటనలో 157 మంది మరణించారు. సుమారు 30 దేశాలకు చెందిన వ్యక్తులు విమానంలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. అయితే బోయింగ్ 737 విమానాలను ఇథియోపియా, చైనా దేశాలు రద్దు చేశాయి. ఆ దేశాల్లో నడుస్తున్న ఆ విమానాలను గ్రౌండ్ చేశారు. ఇథియోపియా ప్రమాదం నేపథ్యంలో .. భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నది. భారత పౌర విమానయాన శాఖ దీనిపై చర్చించనున్నది. భారతీయ వైమానిక శాఖలకు డీజీసీఏ అదనపు భద్రతా ఆదేశాలు ఇవ్వనున్నది. బోయింగ్ విమానాలను వాడుతున్న ఇండియన్ ఆపరేటర్లకు డీజీసీఏ ఈ ఆదేశాలు జారీ చేయనున్నది.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్