బాలీవుడ్ హీరో హీరోయిన్లను టార్గెట్ చేసిన కృష్ణ జింకలు
- March 12, 2019
కృష్ణ జింకలు బాలీవుడ్ నటులను వదిలిపెట్టడం లేదు. ఎంతగా తప్పించుకుందామని ట్రై చేస్తున్నా అంతగా అవి వెంటపడుతున్నాయి. ఇప్పటికే కండలవీరుడు సల్మాన్ ఖాన్ ను జైలుకు పంపిన కృష్ణ జింకలు, ఇప్పుడు మరికొందరు హీరో హీరోయిన్లను టార్గెట్ చేశాయి. కోర్టు నుంచి వారికి నోటీసులు రావడమే ఇందుకు ఉదాహరణ.
హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులకు కృష్ణ జింకల కేసు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణజింకల వేట కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. తాజాగా రాజస్థాన్ హైకోర్ట్.. టబు, సోనా లీ బింద్రే, సైఫ్ అలీ ఖాన్, నీలమ్ కొఠారీ, దుష్యంత్ సింగ్ లకు నోటీసులు పంపింది. ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు శిక్ష విధించడం మాత్రమే సరిపోదని, ఆ సమయంలో సల్లూ భాయ్ తో ఉన్న వారందరినీ శిక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై స్పందించిన కోర్టు, టబు-సోనాలీ-సైఫ్-నీలమ్-దుష్యంత్ లకు నోటీసులు జారీ చేసింది.
కృష్ణ జింకల వేట కేసు దాదాపు రెండు దశాబ్దాల క్రితం నాటిది. 1998 సెప్టెంబర్లో హమ్ సాత్ సాత్ హై షూటింగ్ సందర్భంగా కంకానీ గ్రామంలో కృష్ణ జింకలను వేటాడి రెండింటిని చంపేశారంటూ సల్మాన్ ఖాన్, సోనాలీ బింద్రే, నీలమ్, టబు, దుష్యంత్ సింగ్లపై ఆరోపణలు వచ్చాయి. అదే ఏడాది అక్టోబర్లో బిష్ణోయి గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, ఈ కేసుకు సంబంధించి దశాబ్దాల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. వాదోపవాదాల అనంతరం గత ఏడాది ట్రయల్ కోర్టు, సల్మాన్ ను దోషిగా తేల్చింది. మూగజీవులను బలిగొన్నందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 లోని 9/51 ప్రకారం సల్మాన్ ఖాన్కు ఐదేళ్లు జైలు విధించింది. సోనాలీ-నీలమ్-సైఫ్-టబు-దుష్యంత్ లను నిర్దోషులుగా ప్రకటించింది. ఇక, శిక్ష పడిన తర్వాత సల్లూ భాయ్ 2 రాత్రులు జైలులో గడిపారు. అనంతరం బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చారు.
తాజాగా ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో సల్మాన్ది ఎంత తప్పు ఉందో అతనితో పాటు ఉన్న వారిది కూడా అంతే తప్పు ఉందని పిటిషనర్ ఆరోపించారు. 2018 ఏప్రిల్ 5న టబు-సోనాలీ-సైఫ్-దుష్యంత్-నీలమ్ లను నిర్దోషులుగా ప్రక టించడాన్ని తప్పుబట్టిన పిటిషనర్, వారిని కూడా శిక్షించాలని కోరారు. స్పందించిన హైకోర్టు, వారికి నోటీసులు పంపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..