బ్రెజిల్ లో కాల్పులు: 5 పిల్లలు సహా 9 మంది మృతి
- March 13, 2019
బ్రెజిల్ లోని ఒక ఎలిమెంటరీ పాఠశాలలో తుపాకులు గర్జించాయి. ఈ సంఘటనలో ఐదుగురు పిల్లలు సహా 9 మంది మరణించారు. 17 మందికి పైగా గాయపడ్డారు. బుధవారం ఉదయం ఇద్దరు యువకులు కాల్పులు జరుపుతూ భవనంలోకి ప్రవేశించారని సావో పాలో పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో ఐదుగురు స్కూలు పిల్లలు, భవనంలో పనిచేసే వ్యక్తి, స్కూలు బయట నిలబడిన మరొకరు, ఇద్దరు షూటర్లు ఉన్నట్టు పోలీసులు చెప్పారు.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ముఖానికి మాస్కులు వేసుకున్న ఇద్దరు యువకులు కాల్పులు జరుపుతూ రౌల్ బ్రెసిల్ ఎలిమెంటరీ పాఠశాల భవనంలోకి ప్రవేశించారు. చివరకు వారు తమను తామే కాల్పుకుని చనిపోయారు. ఈ కాల్పుల్లో కనీసం 17 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చాలా మంది పిల్లలు ఉన్నారు. గాయపడిన వారిని హాస్పిటళ్లకు తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలియ రాలేదు. అంతకు ముందు ఈ స్కూల్ కి 500 మీటర్ల దూరంలో మరో షూటింగ్ జరిగింది. అయితే ఈ రెండిటికి సంబంధం ఉందా లేదా అనేది తెలియడం లేదు.
ప్రపంచంలోనే అత్యంత హింసాత్మక దేశాల్లో ఒకటిగా పేరున్న బ్రెజిల్ లో స్కూల్ షూటింగ్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి. చివరిసారి రియో డి జెనిరోలో 2011లో జరిగిన స్కూల్ షూటింగ్ లో 12 మంది మరణించారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!