పాక్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డ జూనియర్ భుట్టో
- March 14, 2019
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో విరుచుకుపడ్డారు. పాక్‌ను ప్రపంచానికి శత్రుదేశంగా మార్చేశారని ఆరోపించారు. ఇండియా-పాకిస్థాన్ మధ్య నెలకొన్న పరిస్థితులపైనా ఆయన మాట్లాడారు. ఉగ్ర సంస్థలకు పాక్‌లో స్థానం ఉండబోదని ఇమ్రాన్ అన్న వ్యాఖ్యలపై స్పందించారు.
' పాకిస్థాన్‌తో క్రమంగా అన్ని దేశాలు సంబంధాలు తెంచుకుంటున్నాయి. ప్రధాని ఇమ్రాన్ తీసుకుంటున్న చర్యల వల్లే ఇదంతా. ఉగ్రవాద నియంత్రణకు చర్యలు తీసుకుంటుంటే ప్రపంచ దేశాలు పాక్‌పై ఎందుకు మండిపడుతున్నాయి? ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులకు నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి.ఇండియా-పాక్ మధ్య ఎప్పటి నుంచో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువయ్యాయి? మీరు(ఇమ్రాన్) నిజంగా శాంతిని కోరుకుంటుంటే ముందు ప్రపంచ దేశాల ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఉగ్రవాద నియంత్రణ పట్ల నిజాయతీగా ఉన్నట్లయితే మేం చెప్పే మూడు విషయాలను తీవ్రంగా తీసుకోండి. 'పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కమిటీని నియమించండి', 'నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మద్దతివ్వడం ఆపేయండి. లేదా వారికి దూరంగా ఉండండి', ' మీ మంత్రి వర్గంలో ఉండి నిషేధిత సంస్థలతో బంధాలు కొనసాగిస్తున్న వారిపై విచారణ జరిపి వారిని తొలగించండి'.. ఈ మూడు చర్యలు ప్రభుత్వం తీసుకుంటే ఉగ్రవాద నియంత్రణకు పాక్ ప్రభుత్వం కృషి చేస్తుందని మాతో పాటు అందరూ నమ్ముతారు' అని భుట్టో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!