ముంబై లో విషాదం.. కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్..
- March 15, 2019
ముంబైలో విషాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత ఛత్రపతి శివాజీ టర్మినల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. సీఎస్టీలోని ప్లాట్ ఫాం నెంబర్-1 నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా సమీపంలోని బీటీ లేన్ ను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అకస్మాత్తుగా కుప్పకూలింది. సాయంత్రం బిజీగా ఉన్న సమయంలో పాదచారుల వంతెన ఒక్కసారిగా కూలడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.
ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బ్రిడ్జ్ కూలిన ఘటనతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్కు అంత రాయం ఏర్పడటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
ఇదిలా ఉంటే, ప్రమాదానికి గురైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రిపేర్ లో ఉన్నట్లు సమాచారం. ఉదయమే ఆ వంతెనకు మరమ్మతులు చేసినట్లు తెలు స్తోంది. రిపేరింగ్ పనులు పూర్తి కానప్పటికీ ప్రజలు ఆ వంతెనపై నుంచే వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..