సోలార్‌ పవర్‌తో షార్జా పార్క్‌లు

సోలార్‌ పవర్‌తో షార్జా పార్క్‌లు

షార్జా మునిసిపాలిటీ అత్యంత మెరుగైన సామర్థ్యం గల లైటింగ్‌ సిస్టమ్‌ని అల్‌ నఖీల్‌ పార్క్‌లో ఏర్పాటు చేసింది. ఈ లైటింగ్‌ సిస్టమ్‌ సోలార్‌ ఎనర్జీ ఆధారితంగా పనిచేస్తుంది. కొత్త లైటింగ్‌ సిస్టమ్‌ తక్కువ పవర్‌తో మెరుగైన కాంతిని అందిస్తాయి. పబ్లిక్‌ ఎన్‌టైటీస్‌లో గ్రీన్‌ పవర్‌ని వినియోగించడం అనే కాన్సెప్ట్‌తో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. కాగా, అల్‌ నఖీల్‌ పార్క్‌లోని పలు ప్రాంతాల్లో మొత్త 50 లైట్లను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ విధానంతో పనిచేస్తాయి. మరోపక్క ఇదే తరహాలో షార్జాలోని అల్‌ జురైనా పార్క్‌లో 87 పవర్‌ సేవింగ్‌ ల్యాంప్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. 

Back to Top