పాస్‌పోర్ట్‌ సేవా సిస్టమ్‌ని ప్రారంభించిన ఇండియన్‌ ఎంబసీ

పాస్‌పోర్ట్‌ సేవా సిస్టమ్‌ని ప్రారంభించిన ఇండియన్‌ ఎంబసీ

పాస్‌పోర్ట్‌ సేవా ప్రాజెక్ట్‌లో భాగంగా ఇండియన్‌ ఎంబసీ - బహ్రెయిన్‌, పాస్‌పోర్ట్‌ సంబంధిత సర్వీసుల్ని తక్కువ సమయంలో పూర్తి చేసే విధానాన్ని ప్రకటించింది. నిన్నటినుంచి ఈ సర్వీస్‌ అందుబాటులోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్సటర్నల్‌ ఎఫైర్స్‌ - ఇండియా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వున్న అన్ని ఇండియన్‌ ఎంబసీస్‌, కాన్సులేట్స్‌లో ఈ విధానం అమల్లోకి వస్తోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన విధానాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ఇండియన్‌ ఎంబసీ - బహ్రెయిన్‌ పేర్కొంది. కొత్త పోర్టల్‌ ద్వారా మార్చి 20 నుంచి ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తుదారులు, ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, యూజర్‌ ఐడీని క్రియేట్‌ చేసుకోవడం ద్వారా యూసర్‌ ఫ్రెండ్లీ అప్లికేషన్‌ తేలిగ్గా సేవలు అందిస్తుందని చెప్పారు అధికారులు. 

Back to Top