స్నేక్స్‌తో అప్రమత్తంగా వుండాలి

స్నేక్స్‌తో అప్రమత్తంగా వుండాలి

కువైట్‌ సిటీ: కువైట్‌లో వర్షాల కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. దాంతో ఎక్కడ చూసినా బటర్‌ ఫ్లైస్‌ (సీతా కోక చిలుకలు) ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్పింగ్‌ సీజన్‌కి సూచకంగా ఇవి ఎక్కువగా కన్పిస్తాయి. అయితే, ఆస్ట్రానమర్‌ డాక్టర్‌ అదెల్‌ అల్‌ సాదౌమ్‌ మాట్లాడుతూ, స్నేక్స్‌ అలాగే పలు రకాలైన ప్రమాదకర రెప్టైల్స్‌తో ప్రమాదం పొంచి వుంది గనుక, కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు. మరోపక్క, బటర్‌ ఫ్లైస్‌ మిగతా రోజుల్లోనూ కన్పించినా, ఈ సీజన్‌లో చాలా ఎక్కువగా వుంటాయనీ, కొద్ది వారాల్లోనే ఇవి మాయమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. మెటియరాలజిస్ట్‌ ఎస్సా రమదాన్‌ మాట్లాడుతూ, బటర్‌ ఫ్లైస్‌కీ ఈ సీజన్‌కీ సంబంధం వుందనీ, పెద్దయెత్తున మైగ్రేషన్‌ కారణంగా ప్లాంట్స్‌ సంఖ్య పెరుగుతుందని చెప్పారు. 

Back to Top