ఇరాక్ లో ఘోర పడవ ప్రమాదం 100 మంది మృతి
- March 22, 2019
బాగ్దాద్:ఇరాక్‌లోని మోసుల్ సమీపంలో టైగ్రిస్ నదిలో గరువారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో పాటు నదీ ప్రవాహం అధికంగా ఉండటంతో పడవ మునకకు గురై నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 100 మంది మృతి చెందారు. మృతిచెందిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రతినిధి సైఫ్ అల్ బద్ర్ తెలిపారు. ఇప్పటివరకు 30 మందిని రక్షించామని, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే పడవలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న సమాచారం తెలియదని అన్నారు. పర్యాటక ప్రాంతమైన నౌరజ్లో కుర్దిష్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ప్రయాణికులు ఈ పడవలోకి ఎక్కారని సివిల్ డిఫెన్స్ అధికారి కల్నల్ హుస్సామ్ ఖలీల్ వెల్లడించారు. ప్రతీ ఏడాది వసంత రుతువులో ఈ వేడుకను జరుపుకుంటారని అన్నారు. పడవలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగిందని, సహాయం అందించేందకు పక్కన మరో పడవలు లేకపోవడంతో మృతుల సంఖ్య అధికంగా ఉన్నట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!