'మా' అధ్యక్షుడిగా నరేశ్ ప్రమాణస్వీకారం
- March 22, 2019హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు నరేశ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయంలో కొంతకాలంగా నరేశ్‌కు, 'మా' మాజీ అధ్యక్షుడు, శివాజీ రాజాకు అభిప్రాయభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈరోజు ప్రమాణస్వీకారానికి శివాజీరాజా కూడా హాజరుకావడం గమనార్హం. ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ.. '
'మా' కమిటీ భవిష్యత్తులో అద్భుతాలు చేయాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని, ఎప్పటిలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. నాకంటే ముందు అధ్యక్షులుగా పనిచేసిన వారు చెప్పిందేంటంటే.. 'మేం ఎక్కడెక్కడి నుంచో కష్టపడి ఫండ్స్ తీసుకొచ్చిపెట్టాం. దాంట్లోంచి పైసా కూడా కదపకుండా చూసుకున్నాం. మీరు కష్టపడి బయటనుంచి ఫండ్లు కలెక్ట్ చేసి తీసుకురావాలి' అని చెప్పారు. తూచా తప్పకుండా వారి మాటను నేను పాటించాను. అదే విధంగా ఇప్పుడు పనిచేయబోయే కమిటీ కూడా అంతే కష్టపడాలని ఆశిస్తున్నాను. నా నుంచి ఏ సాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధమే' అన్నారు. 'మా' కోసం ఓ ప్రత్యేక గీతాన్ని కమిటీ రూపొందించినట్లు ఈ సందర్భంగా నరేశ్ వెల్లడించారు. ఈ పాటను సూపర్‌స్టార్ కృష్ణ దంపతులు, కృష్ణంరాజు దంపతుల చేతుల మీదుగా విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం