ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం
- March 22, 2019
హైదరాబాద్: ఐపీఎల్ ఫీవర్ క్రికెట్ అభిమానులను ఊపేస్తోంది. టిక్కెట్ల అమ్మకాలు కూడా ఉపందుకున్నాయి. ఆన్‌లైన్ వెబ్‌సైట్ www.eventsnow.com ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్‌ల టిక్కెట్లు కొనుగోలు చేయడానికి అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈనెల 29న ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ ఆడే తొలి మ్యాచ్ టిక్కెట్లలో ఒక్క రూ.1,562ల శ్రేణివి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రూ.500, రూ.781, రూ.1,953 టిక్కెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. ఉప్పల్‌లోనే ఈనెల 31న బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో జరిగే మ్యాచ్ టిక్కెట్లలో రూ.1,171, రూ.3,125, రూ.5,468 శ్రేణివి అందుబాటులో ఉండగా రూ.500, రూ.781, రూ.1,367 టిక్కెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. ఇక, హైదరాబాద్‌లో ఎనిమిది టిక్కెట్ విక్రయ కేంద్రాలతో పాటు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారు అసలైన టిక్కెట్లు పొందేందుకు నాలుగు ప్రత్యేక అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేశారు. జింఖానా గ్రౌండ్స్, అసెంబ్లీ మెట్రో స్టేషన్, సరూర్‌నగర్ స్టేడియం, గచ్చిబౌలి బీడబ్స్‌లో టిక్కెట్ల విక్రయ కేంద్రాలతో పాటు రిడెంప్షన్ అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేయగా మియాపూర్, మూసాపేట్, నాగోల్, బేగంపేట మెట్రో స్టేషన్లలో విక్రయ కేంద్రాలను ప్రారంభించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్‌లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







