తొలి మహిళా సౌదీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్
- March 22, 2019జెడ్డా: సౌదీ ఎయిర్ నేవిగేషన్ సర్వీసెస్ (ఎస్ఎఎన్ఎస్), తొల బ్యాచ్ మహిళా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అపాయింట్మెంట్, వర్క్ స్టార్ట్‌ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. జెడ్డాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో వీరు విధుల్ని ప్రారంభించారు. మొత్తం 11 మంది మహిళలు ఏడాది ట్రైనింగ్ ప్రోగ్రామ్ని పూర్తి చేసుకున్నారు. ఎస్ఎఎన్ఎస్ ఈ శిక్షణను సౌదీ అకాడమీ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌తో కలిసి అందించింది. మహిళల్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కోసం తొలిసారిగా శిక్షణ ఇచ్చిన కార్యక్రమం ఇది. విజన్ 2030లో భాగంగా ఈ ఇనీషియేటివ్‌ని ప్రారంభించారు. మహిళల్ని అన్ని రంగాల్లోనూ ప్రోత్సహించేందుకుగాను ఈ అద్భుతమైన కార్యక్రమం చేపట్టామనీ, మహిళా లోకం నుంచి మంచి స్పందన లభిస్తోందని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు