రోడ్డు ప్రమాదంలో దర్శకుడు దుర్మరణం
- March 24, 2019రోడ్డు ప్రమాదంలో ఓ యువ దర్శకుడు మృతి చెందాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూడుబిద్రె శిర్థాడి వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కారు అదుపుతప్పి బలంగా చెట్టుకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడిని కన్నడ దర్శకుడు హ్యరిస్ హౌదాల్ గా గుర్తించారు. హ్యరిస్ నిద్రమత్తులో ఉండి కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున హ్యరిస్ కారులో మూడుబిద్రె నుండి శిరిడికు వెళ్తుండగా ప్రమాదం ఛోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో హ్యారిస్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..