ఘనంగా వెంకటేష్ కూతురి వివాహం
- March 24, 2019
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రీత వివాహం వినాయక్ రెడ్డితో అంగరంగ వైభవంగా జరిగింది. జైపూర్లో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు. వేడుకకు టాలీవుడ్ హీరో రాంచరణ్ దంపతులు, హీరో రానా అలాగే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఆదివారం ఉదయం జరిగిన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను రాంచరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్ లో షేర్ చేశారు.
వధూవరులతో పాటు వెంకటేష్ దంపతులతో కలిసి చరణ్ ఉపాసన దిగిన ఫోటో అలాగే హీరో రానా తో కలిసి దిగిన ఫోటోలను ఉపాసన పోస్ట్ చేశారు. కాగా వరుడు వినాయక్ రెడ్డి హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు. దగ్గుబాటి ఫ్యామిలీ సినీ ప్రముఖుల కోసం త్వరలో హైదరాబాద్లో రిసెప్షన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..