నయనతారపై వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్టీనుంచి సస్పెండ్..
- March 25, 2019
సీనియర్ నటుడు, డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాధారవి హీరోయిన్ నయనతారపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై డీఎంకే పార్టీ చర్యలకు ఉపక్రమించింది. వివరాల్లోకి వెళితే.. నయనతార నటించిన తాజా చిత్రం కొలైయుధీర్ కాలం. హారర్, థ్రిల్లర్ ఇతి వృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం చెన్నైలోని ఓ హోటల్లో జరిగింది. అయితే నయనతార మాత్రం ఈ ఆడియో ఫంక్షన్ కు హాజరు కాలేదు. నటుడు రాధారవి ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. వేడుకలో ఆయన మాట్లాడుతూ.. నయనతారపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. ‘నయనతార మంచి నటి. ఇంతకాలంగా సినీరంగంలో అగ్ర కథానాయకిగా కొనసాగడం చాలా పెద్ద విషయం. నయన గురించి ప్రచారం కాని వార్తలే లేవు. అవన్నీ తట్టుకుని నిలబడింది. తమిళ ప్రజలు ఎప్పుడూ ఒక విషయాన్ని కొన్ని రోజులు మాత్రమే గుర్తుంచుకుంటారు.
నయనతార ఒక చిత్రంలో దెయ్యంగానూ నటించింది. మరో చిత్రంలో సీతగానూ నటించింది. ఇప్పుడు సీతగా ఎవరైనా నటించవచ్చు. ఇంతకుముందు అయితే సీతగా నటించడానికి కేఆర్ విజయనే ఎంచుకునే వారు. ఇప్పుడు చూడగానే నమస్కరించాలనే వారు నటించవచ్చు, చూడగానే పిలవాలనిపించే వారు నటించవచ్చు. నయనతారను చూస్తే దెయ్యాలు పారిపోతాయి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో నయన అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాధారవి ఇలా మాట్లాడటంతో షాక్ కు గురైన ఆమె స్నేహితుడు విఘ్నేశ్ శివన్.. ఆయనపై మండిపడ్డారు.. ఒక పారంపర్య కుటుంబం నుంచి వచ్చిన వారి నోటి నుంచి వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎవరు చర్యలు తీసుకుంటారు? అంటూ ప్రశ్నించారు. మరోవైపు నటనపై ఈ వ్యాఖ్యలు చేయడాన్ని డీఎంకే నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఆయనపై సస్పెన్షన్ విధిస్తు నిర్ణయం తీసుకుంది ఆ పార్టీ.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..