మేడమ్ టుస్సాడ్స్ మహేష్ బాబు మైనపు విగ్రహం
- March 25, 2019
సింగపూర్‌కు చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు తయారు చేసిన మహేష్ బాబు మైనపు విగ్రహ ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్‌లోని ఎఎంబి థియేటర్లో గ్రాండ్‌గా జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి హాజరయ్యారు. మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు, అభిమానుల ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ జరిగింది. గచ్చిబౌలిలోని ఎఎంబి సినిమాస్‌లో కొలువుదీరిన ఈ విగ్రహం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. బ్లాక్ సూట్‌లో ఉన్న మహేష్ మైనపు విగ్రహం ఆకట్టుకుంటోంది. అభిమానుల కోసమే ఈ విగ్రహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు వాక్స్ స్టాచ్యూ
విగ్రహా విష్కరణ అనంతరం మహేష్ బాబు మాట్లాడుతూ... ఇది అద్భుతంగా ఉందని, అమేజింగ్ లుక్ అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరుగడం ఆనందంగా ఉందన్నారు.
ఒక రోజు పాటు అభిమానుల సందర్శనార్థం
ఈ రోజు (మార్చి 25) మొత్తం కూడా ఈ విగ్రహాన్ని అభిమానుల సందర్శనార్థం ఎఎంబి సినిమా థియేటర్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ రోజు రాత్రి దీన్ని సింగపూర్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
సింగపూర్ బయట ఇదే తొలిసారి
సింగర్‌పూర్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు... సింగపూర్ బయట ఒక సెలబ్రిటీ వాక్స్ స్టాచ్యూను ఆవిష్కరించడం ఇదే తొలిసారి. మహేష్ బాబు సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటంతో ఈ విగ్రహాన్ని స్వయంగా ఇక్కడకు తీసుకొచ్చి ఆవిష్కరించారు.
గౌరవంగా భావిస్తున్నాను
నా సొంత నగరంలో... నా అభిమానులు, కుటుంబం సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరుగడం ఆనందంగా ఉంది అంటూ మహేష్ బు వెల్లడించారు.
తాజా వార్తలు
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!







