'మన్మథుడు2' షూటింగ్ షురూ
- March 25, 2019
మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, పి. కిరణ్ నిర్మాతలుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'మన్మథుడు 2' షూటింగ్ ఈ రోజు (సోమవారం) ప్రారంభమైంది. సీనియర్ రైటర్ సత్యానంద్.. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌కి స్క్రిప్ట్‌ని అందించగా, అమల అక్కినేని ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. యువ సామ్రాట్ నాగ చైతన్య కెమెరా స్విచాన్ చేయగా మొదటి షాట్‌ని దేవుని పటాలపై చిత్రీకరించారు. సుమంత్, సుశాంత్, నాగ సుశీల, యార్లగడ్డ సురేంద్ర ఇంకా అక్కినేని కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారం రోజులు హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్ జరుపుకున్నాక చిత్ర యూనిట్ పోర్చుగల్ వెళ్లనుంది. అక్కినేని నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. "చి||ల||సౌ చిత్రాన్ని నాగార్జున గారు చూసి మెచ్చుకుని అన్నపూర్ణ ద్వారా రిలీజ్ చేశారు. ఆ చిత్రాన్ని చూసినప్పుడే ఆయన నాతో సినిమా చేస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నాకు ఈ చిత్రాన్ని చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలని తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..