న్యూఢిల్లీలో 'ఆపరేషన్ బ్లాక్ రోస్' పేరుతో తనిఖీలు
- December 30, 2015
దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం అర్దరాత్రి కమాండోలు తనిఖీలు నిర్వహించాయి. న్యూఢిల్లీలో మంగళవారం రాత్రి హై అలర్ట్ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. దక్షిణఢిల్లీలోని రెండు షాపింగ్ మాల్స్, హార్ట్ ఆఫ్ సిటీగా ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ ప్రాంతంలో బలగాలను మోహరించారు. భద్రతా చర్యలో భాగంగా కమాండోలు 'ఆపరేషన్ బ్లాక్ రోస్' పేరుతో తనిఖీలు చేశారు. ఉగ్రదాడుల భయంతో దాదాపు నాలుగు ఏరియాలలో వసంత్ కుండజ్, పలికా బజార్, నెహ్రూ పాలెస్ లోని హోటల్ ఇరోస్ ఇంటర్నేషనల్, సమీప ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది, కమాండోలు కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. ప్రజలను, కస్టమర్లను తనిఖీలు నిర్వహించే సమయంలో అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు.అక్కడ ఏం జరుగుతుందో.. కమాండోలు ఎందుకు అక్కడ తనిఖీలు చేస్తున్నారు.. తమని ఎందుకు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోమ్మంటున్నారో అర్ధంకాక సామన్య ప్రజలు, కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, రెగ్యూలర్ తనిఖీలలో భాగంగానే ఆపరేషన్ నిర్వహించామని, జనంతో రద్దీగా ప్రాంతాల్లో ఉగ్ర ముప్పు ఉంటుందన్న భావనతోనే బలగాలు రంగంలోకి దిగాయని ఓ అధికారి తెలిపారు. ముంబై, కోల్ కత్తా, చెన్నై, బెంగళూరు లాంటి మహానగరాలకు ఉగ్ర పొంచి ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తనిఖీలు ప్రజలను కాస్త ఇబ్బందులకు గురిచేసి ఉండవచ్చు, కానీ వారిని ఇక్కడి నుంచి తరలించకపోతే రక్షణ చర్యలు, తనిఖీలు నిర్వహించేందుకు అవకాశం ఉండదని వారు గుర్తించాలని ఓ అధికారి వివరించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







