గాజా పై దాడికి ఇజ్రాయిల్ యత్నాలు
- March 26, 2019
జెరూసలేమ్/గాజా: ఆదివారం రాత్రి తమ భూభాగంపై రాకెట్ దాడి జరిగిందన్న సాకుతో ఇజ్రాయిల్ పాలస్తీనాపై మరోసారి కాలుదువ్వుతోంది. రాకెట్ దాడి నేపథ్యంలో ఇజ్రాయిల్ సోమవారం ఉదయం నుండి సైనిక బలగాలను గాజా సరిహద్దులకు తరలిస్తోందని సైనికాధికారులు మీడియాకు చెప్పారు. గాజాస్ట్రిప్- ఇజ్రాయిల్ మధ్య వున్న సరిహద్దు కంచె సమీపానికి రెండు బ్రిగేడ్ల సైన్యాన్ని తరలించినట్లు బ్రిగేడియర్ జనరల్ రోన్స్ మనెలిస్ చెప్పారు. రాకెట్ దాడి అనంతర పరిస్థితులను సమీక్షించిన ఇజ్రాయిల్ సైన్యాధిపతి ఆదేశాల మేరకు తాము ప్రస్తుతం రెండు బ్రిగేడ్ల సైన్యాన్ని సరిహద్దులకు తరలిస్తున్నామని ఆయన వివరించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా తాము సైనిక పరంగా పూర్తి సన్నద్దతతో వ్యవహరిస్తున్నామని ఆయన చెప్పారు. గాజాస్ట్రిప్ దక్షిణ ప్రాంతం నుండి పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌కు చెందిన మిలిటెంట్లు తమ భూభాగంపై రాకెట్ దాడి చేశారని మనెలిస్ చెప్పారు. రాకెట్ దాడి నేపథ్యంలో తన అమెరికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని స్వదేశానికి వస్తున్నట్లు ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై చేసిన ఈ దాడికి తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..