కార్స్ స్నూపింగ్: నిందితుడి అరెస్ట్
- March 26, 2019
దుబాయ్ పోలీసులు, కార్స్ స్నూపింగ్‌కి పాల్పడుతున్న ఓ అనుమానితుడ్ని అరెస్ట్ చేశారు. జుమైరా ప్రాంతంలో నిందితుడి అనుమానాస్పద కదలికల్ని సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా సేకరించి, నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. కార్లను అనుమానాస్పద స్థితిలో గమనిస్తూ నిందితుడు, కారు యజమానుల్ని, ఇతరుల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు పోలీసులు వివరించారు. నిందితుడు ఓ కాంట్రాక్టింగ్ కంపెనీ కోసం పనిచేస్తున్నాడనీ, అతనిపై అబ్స్కాండింగ్ రిపోర్ట్ కూడా ఫైల్ అయ్యిందని అధికారులు చెప్పారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. కాగా, సోషల్ మీడియాలో వైరల్ చేయడం కోసం వీడియోల్ని షూట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తగదంటూ దుబాయ్ పోలీస్ మీడియా సెక్షన్ డైరెక్టర్ కల్నల్ ఫైస్సాల్ అల్ కాసిమి సూచించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..