రోడ్డు ప్రమాదం: 14 ఏళ్ళ బాలిక మృతి
- March 27, 2019
యూ.ఏ.ఈ:14 ఏళ్ళ ఎమిరేటీ బాలిక కారుని అతివేగంగా నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. అల్ హారేలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు సిమెంట్ బ్యారియర్‌ని ఢీకొనడంతో పల్టీలు కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయాల పాలైన బాలికను ఖోర్ ఫక్కాన్ హాస్పిటల్‌కి తరలించగా, అక్కడ ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి ట్రాఫిక్ అధికారుల టీమ్స్, పెట్రోల్స్, అంబులెన్స్ చేరుకున్నాయనీ ఈస్టర్న్ రీజియన్ పోలీస్ డైరెక్టర్ కల్నల్ అలి అల్ కాయ్ అల్ హమ్మౌది చెప్పారు. తల్లిదండ్రులకు తెలియకుండానే ఆ బాలిక కారుని నడిపినట్లు తెలుస్తోంది. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తూ, బాలిక మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు కల్నల్ అలి అల్ కాయ్ అల్ హమౌది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..