దుబాయ్‌ నుంచి ఫ్లై అవుతున్నవారికి ఎమిరేట్స్‌ అడ్వయిజరీ

- March 27, 2019 , by Maagulf
దుబాయ్‌ నుంచి ఫ్లై అవుతున్నవారికి ఎమిరేట్స్‌ అడ్వయిజరీ

ఈ వారాంతంలో దుబాయ్‌ నుంచి ఫ్లయ్‌ అయ్యేవారికి ఎమిరేట్స్‌ ఓ సూచన చేసింది. వీకెండ్‌లో ఎయిర్‌పోర్ట్‌లో క్రౌడ్‌ ఎక్కువగా వుండే అవకాశం వుందనీ, మరీ ముఖ్యంగా మార్చి 29న పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు వచ్చే అవకాశం వున్న దరిమిలా, ప్రయాణీకులు ముందస్తుగా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవాలని ఎమిరేట్స్‌ సూచించింది. టెర్మినల్‌ 3లో మార్చి 29న 42,000 మందికి పైగా ప్రయాణీకులతో అత్యంత బిజీగా వుంటుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌ 2 వరకు పీక్‌ ట్రావెల్‌ కొనసాగవచ్చునని ఎమిరేట్‌స పేర్కొంది. ఈ సమయంలో 205,000 ఎమిరేటీలు దుబాయ్‌ నుంచి వెళతారని అంచనా. అలాగే 160,000 మంది ప్రయాణీకులు దుబాయ్‌కి వస్తారని అంచనా వేశారు. కనీసం 60 నిమిషాల ముందు చెక్‌ ఇన్‌కి రాని ప్రయాణీకులకు ప్రయాణానికి అనుమతినివ్వరు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com