మాధురి చెప్తున్న ప్రేమ కధ

- March 28, 2019 , by Maagulf
మాధురి చెప్తున్న ప్రేమ కధ

అర్థవంతమైన చిత్రాల్లో భాగమవ్వాలని కోరుకుంటున్నానని చెబుతోంది బాలీవుడ్‌ తార మాధురీ దీక్షిత్‌. నిన్నటితరాన్ని తన అందంతో, నృత్యాలతో ఊపేసిన ఈ అందాల భామ.ఇప్పటికీ హిందీ తెరపై వన్నె తరగని ప్రభావాన్ని చూపిస్తోంది. అయితే అప్పట్లోలా కాకుండా ఆచితూచి మంచి సినిమాలను ఎంచుకుంటోంది. ఎదిగిన తర్వాత కూడా గతంలోలా నటించలేం కదా అన్నది మాధురీ మాట. నెట్‌ ఫ్లిక్స్‌ కోసం ఆమె నిర్మించిన చిత్రం ఆగస్టు 15. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మాధురీ దీక్షిత్‌ మాట్లాడుతూ..అర్థవంతమైన సినిమాల్లో నటించాలని, వీలు కానప్పుడు అలాంటి చిత్రాలకు అండగా నిలబడాలని నేనెప్పుడూ కోరుకున్నాను. నా కోరిక నెరవేర్చుకునేందుకు ఆగస్టు 15 సినిమా కంటే గొప్ప కథ ఉండదేమో. ఇది మనల్ని మనం పోల్చుకునే సినిమా. నటీనటులు, సాంకేతిక నిపుణులు కథకు అందమైన రూపాన్నిచ్చారు. అని చెప్పింది. ఆగస్టు 15 ఒక ప్రేమ కథ.

ప్రేమ, స్వాతంత్య్రం గొప్పదనం గురించిన అంశాలుంటాయి. ముంబైలోని ఓ ప్రాంతం ఆగస్టు పదిహేను స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు సిద్ధమవుతుంది. ఇంతలో ఓ ప్రేమికుడు తన ప్రేమకున్న అడ్డంకులు తొలగేందుకు సహాయం చేయమని ఆ ప్రాంత ప్రజలను కోరుతాడు. ఆ ప్రేమ జంట కోరికకు స్థానిక ప్రజలు ఎలా స్పందించారు. ఈ క్రమంలో వాళ్లకు ప్రేమ గొప్పదనం ఎలా తెలిసింది అనేది ఆగస్టు15 చిత్ర కథాంశం. ఇదంతా ఒక రోజులో జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com