ఆన్లైన్ గేమ్ తెచ్చిన చేటు: బాలుడి మృతి
- March 28, 2019
14 ఏళ్ళ ఉక్రేనియన్ బాలుడు, 15వ ఫ్లోర్ నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. అల్ మజాజ్లో ఈ ఘటన జరిగింది. గ్రాండ్ ఫాదర్‌తో సెలవుల్ని ఎంజాయ్ చేద్దామని వచ్చిన బాలుడి వ్యవహార శైలిలపై కొద్ది రోజులుగా అతని తల్లిదండ్రులకు అనుమానాలు కలుగుతున్నాయి. తన గ్రాండ్ సన్ డిప్రెస్డ్గా వుంటున్నాడనీ, స్మార్ట్ ఫోన్ మరియు గ్యాడ్జెట్స్‌కి ఎప్పుడూ అతుక్కుపోయి వుంటున్నాడని బాధితుడి గ్రాండ్ ఫాదర్ చెప్పారు. వీడియో గేమ్స్, ఇంటర్నెట్కి అడిక్ట్ అవడమే ఈ ఘటనకు కారణంగా అనుమానిస్తున్నారు. రాత్రంతా ఆన్లైన్ గేమ్స్ ఆడి, ఆ బాలుడు ఆ తర్వాత భవనం పైనుంచి పడి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. సౌదీ అరేబియాలో తన తల్లితో కలిసి ఈ బాలుడు నివసిస్తున్నాడు. అతని పేరెంట్స్ డైవోర్స్డ్ అని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..