సౌదీ అరేబియాకి ఆయుధాల ఎగుమతులపై జర్మనీ నిషేధం
- March 30, 2019
రియాద్:సౌదీ అరేబియాకు ఆయుధాల ఎగుమతులపై మరో ఆరు నెలలపాటు నిషేధం విధించినట్టు జర్మనీ వెల్లడించింది. కాగా, ఇస్తాంబుల్‌లోని సౌదీ ఎంబసీలో జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య ఘటన అనంతరం పలు దేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఖషోగ్గి హత్యతో సౌదీ యువరాజు సల్మాన్‌కు సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. సౌదీ తీరును పలు దేశాలు ఖండించగా, పలుదేశాలు ద్వైపాక్షిక సంబంధాలను తాత్కాలికంగా నిలిపివేసుకున్నాయి. సౌదీకి ఆయుధాల సరఫరా తాత్కాలికంగా నిలిపివేసినట్టు గతేడాది అక్టోబర్‌లో జర్మనీ ప్రకటించింది. గతంలో సౌదీతో కుదుర్చుకున్న 13.27 బిలియన్ డాలర్ల ( రూ.91,83,90,160 ) ఒప్పందాన్ని జర్మనీ తాత్కాలికంగా నిలిపివేసుకుందని ఫ్రాన్స్‌లో జర్మనీ దౌత్యవేత్త అనీమారీ డెస్కోట్స్ తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..