కన్నడ నటుడు‘చిరంజీవి సర్జా’ సినిమా షూటింగ్ లో విషాదం
- March 30, 2019
కన్నడ నటుడు చిరంజీవి సర్జా సినిమా ‘రణం’ షూటింగులో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి తల్లీబిడ్డ మృతిచెందారు. బెంగుళూరు లోని బాగలూరు వద్ద ‘రణం’ సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ చూసేందుకు అదే ప్రాంతానికి చెందిన సుయేరా బాను తన ఎనిమిదేళ్ల కూతురితో కలసి షూటింగ్ చూసేందుకు వెళ్లింది. అయితే ఆ సమయంలో కారును పేల్చేసే దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. అందుకోసం ఓ సిలిండర్ ను వాడారు. అయితే దురదృష్టవశాత్తు ఆ సిలిండర్ పేలిపోయింది.
పేలుడు తీవ్రతకు అక్కడే ఉన్న సుయేరా బాను స్పాట్ లోనే మరణించగా ఆమె కూతురు అయిషా ఖాన్ (8) తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బాలిక కూడా మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్శకనిర్మాతలపై కేసు నమోదు చేశారు. అయితే పేలుడు తర్వాత షూటింగ్ నిలిపేసిన చిత్ర బృందం అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..