డ్రగ్స్ సేవించిన వ్యక్తి: దుబాయ్ క్రీక్‌లో అరెస్ట్
- March 30, 2019
28 క్యాప్సూల్స్ డ్రగ్స్‌ని తీసుకున్న ఓ వ్యక్తి ఆ కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి న్యాయస్థానం ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. నైజీరియాకి చెందిన 29 ఏళ్ళ వ్యక్తి, దుబాయ్‌లో విజిట్ వీసాపై వుంటున్నాడు. 468 గ్రాముల యాంఫిటమిన్ని క్యాప్సూల్స్ రూపంలో నిందితుడు కడుపులో దాచుకన్నట్లు అధఙకారులు తెలిపారు. దుబాయ్ క్రీక్ ద్వారా స్విమ్ చేస్తూ వాటిని స్మగుల్ చేయడానికి నిందితుడు యత్నించాడు. అయితే నిందితుడు విచారణలో తన నేరాన్ని అంగీకరించేందుకు తొలుత నిరాకరించాడు. గత ఏడాది నవంబర్ 4న ఈ ఘటన జరిగింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కాగా, కోర్టు తీర్పుని సవాల్ చేసేందుకు న్యాయస్థానం 15 రోజుల అవకాశం కల్పించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







