హైదరాబాద్ లో బీదర్ కోట..
- April 03, 2019
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథతో సైరా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈచిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇప్పటికే అనేక లొకేషన్స్లో చిత్రీకరణ జరిపారు. ఉయ్యాలవాడ జీవితంలోని కీలక ఘట్టాల్లో బీదర్ కోట ఒకటి. దీనికి సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం కోకాపేటలో బీదర్ కోట సెట్ వేశారు. ఇందులో చిరంజీవితో పాటుగా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత అంచనా ప్రకారం ఈ నెలాఖరుతో సినిమా చిత్రీకరణ పూర్తిచేస్తారు. ఆ తర్వాత విఎఫ్ఎక్స్ పనులు ప్రారంభిస్తారు. ఇందులో నయనతార, అమితాబ్ బచ్చన్, తమన్నా కీలక పాత్రధారులు. అమిత్ త్రివేది స్వరరచన చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాత.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..