జెట్ ఎయిర్వేస్‌ను వెంటాడుతున్న కష్టాలు: నిలిచిపోయిన మరో 15 ప్లైట్లు
- April 03, 2019
ముంబై: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన మరో పదిహేను విమానాలు నిలిచిపోయాయి. అద్దె చెల్లించకపోవడంతో ఆ విమానాలు ఆగిపోయాయి. దీంతో జెట్ ఎయిర్వేస్ నడుపుతున్న విమానాల సంఖ్య 30 కంటే తక్కువగా ఉంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడుతూ.. ఈ సంస్థ తరఫున కేవలం 29 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయని చెప్పారట.
నిధుల కొరతతో జెట్ ఎయిర్‌వేస్‌ను కష్టాలు వెంటాడుతోన్న విషయం తెలిసిందే. ఈ సంస్థను గట్టెక్కించేందుకు రుణదాతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చైర్మన్ నరేష్ గోయల్‌ను, అతని సతీమణిని బోర్డు నుంచి తప్పుకోమని ఒత్తిడి చేసారు. వీరు వారం క్రితం తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సంస్థను గట్టెక్కించేందుకు బ్యాంకర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ, తాజాగా మరో పదిహేను విమానాలు నిలిచిపోయాయి. లీజుకు సంబంధించి చెల్లింపులు జరుపకపోవడం వల్లనే ఈ విమాన సర్వీసులను రద్దు చేసుకుంది. మరోవైపు, తమకు బకాయిపడిన జీతాలపై వడ్డీలు చెల్లించాలని జెట్ ఎయిర్‌వేస్ పైలెట్లు డిమాండ్ చేస్తున్నారు. నియంత్రణ మండలి డీజీసీఏకు రాసిన లేఖలో ది నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్(ఎన్‌ఏజీ) ఈ విషయాన్ని ప్రస్తావించారు. జనవరి నుంచి పైలెట్లు, ఇంజినీర్లకు వేతనాలు చెల్లించాల్సి ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







