మసూద్ అజర్ విషయంలో అమెరికా కఠిన వైఖరి
- April 04, 2019
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చి తీరతామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. మసూద్‌పై నిషేధం విధించే విషయంలో మిత్రదేశాలు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని సభ్యలదేశాలతో కలసి అందుబాటులో ఉన్న అన్ని వనరులు ఉపయోగించుకుంటామని తేల్చి చెప్పింది. ఇందులో భాగంగానే బ్రిటన్, ఫ్రాన్స్ సహకారంతో సరికొత్త తీర్మానం రూపొందించి మండలి సభ్య దేశాలకు పంపించామని అమెరికా తెలిపింది. ఈ తీర్మానంతో ఐక్య రాజ్యసమితిని తక్కువ చేస్తున్నామనే వాదన సరికాదంది.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించ డానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు రంగంలోకి దిగాయి. మూడు దేశాలు కలిసి ఐక్య రాజ్యసమితి భద్రతామండలిలో తీర్మానం ప్రవేశపెట్టాయి. మండలిలోని 15 సభ్య దేశాలు 14 దేశాలు ఆ తీర్మానాన్ని ఆమోదించగా చైనా మాత్రమే హోల్డ్‌లో పెట్టింది. ఐతే తీర్మానాన్ని ఎందుకు అడ్డుకున్నారో రెండు వారాల్లో వివరించాలని చైనాను అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ డిమాండ్ చేశాయి. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా, ఇటీవల భద్రతామండలిలో మరో తీర్మానం ప్రవేశపెట్టింది. మసూద్‌పై ఆంక్షలు విధించి, అతని ప్రయాణాలు నిషేధించాలని, ఆస్తులను స్తంభింపజేయాలని ఆ తీర్మానంలో కోరింది.
ఐసిస్, అల్‌ఖైదాతో మసూద్‌కు సంబంధాలు ఉన్నాయని అమెరికా ఆరోపణ. కొత్త తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం అవసరం లేదు. భద్రతామండలిలోని 9 సభ్యదేశాలు ఆమోదం తెలిపితే సరిపోతుంది. ఇది చైనాకు మంట పుట్టించింది. బలవంతంగా తీర్మానం ఆమోదింపచేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని చైనా మండిపడింది. అమెరికా చర్యతో మసూద్ సమస్య పరిష్కారం క్లిష్టమవుతుందని విమర్శించింది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









