ఫీజులు పెంచిన ఇండియన్‌ స్కూల్‌ వాడి కబీర్‌

- April 08, 2019 , by Maagulf
ఫీజులు పెంచిన ఇండియన్‌ స్కూల్‌ వాడి కబీర్‌

ఒమాన్: ఇండియన్‌ స్కూల్‌ వాడి కబీర్‌ విద్యార్థుల తల్లిదండ్రులు ఇకపై నెలకు 2 ఒమన్‌ రియాల్స్‌ అదనంగా చెల్లించాల్సి వస్తుంది. నెలవారీ స్కూల్‌ ఫీజుల్ని పెంచుతూ స్కూల్‌ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో ఈ పెంపుదల అమల్లోకి వచ్చింది. పెంచిన ఫీజుల్ని తగ్గించాలని ఇటీవల పేరెంట్స్‌, స్కూల్‌ ప్రిమైసెస్‌లో ఆందోళన చేపట్టారు. అయితే ఫీజు పెంపు ద్వారా, మరిన్ని సౌకర్యాలు కల్పించడమే తమ ఉద్దేశ్యమని స్కూల్‌ యాజమాన్యం అంటోంది. అదనంగా 10 ఒమన్‌ రియాల్స్‌ యాన్యువల్‌ సింగిల్‌ పేమెంట్‌ని కో-కరికులర్‌ మరియు కల్చరల్‌ యాక్టివిటీస్‌ కోసం లెవీ చేస్తారు. నెలకు 2 ఒమన్‌ రియాల్స్‌ చొప్పున ఏడాదికి 24 ఒమన్‌ రియాల్స్‌ పెంచరడం ద్వారా మరిన్ని వసతుల కల్పనకు మార్గం సుగమం అవుతుందని, 2019-2020 సంవత్సరానికి ఈ పెంపు అమల్లోకి వచ్చిందని ఐఎస్‌డబ్ల్యుకె స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ పేర్కొంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com